← Back to news

జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల హల్‌చల్

By DK· 27 Jun 2026· హైదరాబాద్‌
జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల హల్‌చల్

TG: హైదరాబాద్‌ బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని శ్రీ జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లోకి చొరబడ్డ ఇద్దరు రౌడీషీటర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. మద్యం మత్తులో షోరూమ్‌లోకి ప్రవేశించి షోరూమ్ మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరించారు. లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దౌర్జన్యానికి దిగారు. తర్వాత వచ్చినప్పుడు డబ్బులు సిద్ధంగా ఉంచాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన పంకజ్ బండ్గర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. CCTV ఫుటేజ్‌ ఆధారంగా నిందితులు అలీమ్, యూనస్‌లను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.