పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి

TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్ తన కుటుంబసభ్యులతో రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నాడు. చిన్నారి మధుస్మిత(4) ను పాము కాటేసింది. వెంటనే పాపను తల్లిదండ్రులు జనగాం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించగా మృతి చెందింది. ఆడుతూ, పాడుతూ మంచిగా చదువుకుంటూ ఉన్న పాప చనిపోవడంతో ఒగ్గు మహేష్ తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



