ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్

TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలుకమనగర్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలు, మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు సూచనల మేరకు ఈ కమిటీని ఎన్నుకున్నారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిని సునీల్, ఉపాధ్యక్షుడు కందిక రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కమిటీకి నూతన బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడిగా కొంకటి మహేష్, ఉపాధ్యక్షుడిగా తనువుల కొమ్మలను ఎంపిక చేశారు.


