ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత అడ్మిషన్లు.. తేదీలు ఇవే

TG: ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి 3వ విడత వాక్‌ఇన్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని ప్రిన్సిపాల్ కె. జయమ్మ గురువారం తెలిపారు. ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


