బిజ్జగూడ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని నిరసన

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం బస్కి పంచాయతీ పరిధిలోని బిజ్జగూడలో రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ MPTC దశరధ్ డిమాండ్ చేశారు. CPM ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 2024లో అడవితల్లి బాట పథకం కింద రోడ్డు మంజూరైంది. కాంట్రాక్టర్ బస్కి నుంచి కొంత్రాయిగూడ మీదుగా బిజ్జగూడ వరకు పనులు ప్రారంభించి సగం వరకు కంకర, మట్టిపోసి మధ్యలోనే నిలిపివేశారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయి రోడ్డు గుంతలమయం అయిందన్నారు.



