← Back to news

5వ వార్డులో ప్రత్యేక ఆధార్ డ్రైవ్

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
5వ వార్డులో ప్రత్యేక ఆధార్ డ్రైవ్

గుంటూరు జిల్లా తాడేపల్లి 5వ వార్డులో యానాది కాలనీ ప్రజల ఆధార్, రేషన్ కార్డు తదితర సమస్యల పరిష్కారానికి శనివారం ప్రత్యేక ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డ్రైవ్‌లో కొత్తగా ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్‌డేట్, e-KYC, బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలు అందించారు. రేషన్ కార్డు సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులకు కుల ధ్రువీకరణ పత్రాల సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

More in Local