← Back to news

రుతు పవనాలు మళ్లీ వాయిదా

By aravinda nyayapati· 2 Jun 2026
రుతు పవనాలు మళ్లీ వాయిదా

దేశంలో ఎండలు మండిపోతూ ఉండడంతో అందరూ నైరుతి ఎప్పుడెప్పుడు వస్తుందాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వీటి రాక ఇంకా ఆలస్యం కానుంది. జూన్ మొదటి వారంలో వస్తాయో లేదోనన్న సందేహాలున్నాయి. కేరళలో నైరుతి బలంగా నిలబడాలంటే దానికి అవసరమైన గాలులు జూన్ 6 తర్వాతే వస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు IMD ఈ ఏడాది వర్షపాతం అంచనాను 92% నుంచి 90%కి తగ్గించింది. ఎల్‌నినో ప్రభావం కూడా ఈ సారి ఆందోళన పుట్టిస్తోంది.

More in General