సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో AP హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడైన CI నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు SITకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ విచారణ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్‌గా వీడియో రికార్డింగ్ చేసి కోర్టు ముందు పెట్టాలని ఆదేశించింది. తనకు ప్రాణహాని ఉందంటూ, రాజమండ్రి జైల్లోనే విచారణ జరపాలని నాగరాజు లాయర్ చేసిన రిక్వెస్ట్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ విచారణతో నిందితుడి హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.



