← Back to news

రాజమహేంద్రవరం ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

By DK· 9 Jun 2026· Dishadaily· రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

AP: రాజమహేంద్రవరంలోని లాలా చెరువుకు సమీపంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్లార్‌లో నిల్వ ఉంచిన కాటన్‌కు మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సెల్లార్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన టైమ్‌లో లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.