కాలం చెల్లిన పదార్థాలతో బేకరీ ఐటమ్స్

TG: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు బేకరీలు, స్వీట్లు, కేకులు, బిస్కెట్ల తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రత, ఈగలు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలతో తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని యూనిట్లలో కాలం చెల్లిన రంగులు, ఫ్లేవర్లు వినియోగించడంతో పాటు తయారీ తేదీ, ఎక్స్‌పైరీ వివరాలు లేకుండానే ఉత్పత్తులను విక్రయానికి సిద్ధం చేసినట్లు తేలింది. మరికొన్ని కేంద్రాలు FSSAI లైసెన్స్ గడువు ముగిసినా, పాతవాటితోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు సాగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.



