← Back to news

జల దోపిడీ ఆపకపోతే పోరాటమే

By DK· 26 Jul 2026
జల దోపిడీ ఆపకపోతే పోరాటమే

తెలంగాణకు రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నది జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని మాజీ మంత్రులు వీ.శ్రీనివాస్ గౌడ్, సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. MLC నవీన్ రెడ్డి, మాజీ MLAలతో కలిసి కర్ణాటకలోని భీమా ప్రాజెక్టు, గూడూరు బ్యారేజీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎక్కడికక్కడ బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించి తెలంగాణ వాటా నీటిని నిలిపేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

More in TG