← Back to news

అక్కపెల్లి వద్ద రాకపోకలు బంద్.. హైఅలర్ట్

By DK· 29 Jul 2026· మంచిర్యాల జిల్లా
అక్కపెల్లి వద్ద రాకపోకలు బంద్.. హైఅలర్ట్

TG: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అక్కపెల్లి గ్రామం వద్ద పాలవాగు ఉప్పొంగి లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రహదారిని పూర్తిగా మూసివేసి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ మల్లికార్జున్, సీఐ, ఎంపీడీవో కలిసి పరిస్థితిని పరిశీలించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లి చేపల వేట, ఈత, ఫోటోలు తీయొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

More in TG