భారత్‌కు మరో గోల్డ్.. బాక్సింగ్‌లో అంకుష్ పంచ్
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ అంకుష్ పంఘల్ పురుషుల 80 కేజీల క్యాటగిరి లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సియోంగ్‌ను 4-0తో ఓడించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ ఫజ్లిద్దీన్ ఎర్కిన్‌బోయెవ్‌ను 4-1తో ఓడించి ఫైనల్‌కు చేరాడు. అంకుష్ గోల్డ్ మెడల్ తో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది.

