ఓటర్ల తొలగింపు కుట్ర..కాంగ్రెస్ ఆరోపణలు

హైదరాబాద్‌లో కొంతమంది ఓటర్లను లిస్ట్ నుంచి తొలిగించేందుకు కుట్ర చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బహదూర్‌పురా నియోజకవర్గంలో ఓటర్ల పేర్లు, అడ్రస్ ముందుగానే ముద్రించిన ఫారం-7 సిద్దం చేశారని చెప్తుంది ముషీరాబా.ద్‌లోనూ ఇలానే చేశారని తెలిపింది. అయితే ఫారం-7 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ తెలిపారు. అయితే ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు.

