← Back to news

చెరువులే భావితరాల భవిష్యత్తు: CM

By DK· 2 Aug 2026· హైదరాబాద్
చెరువులే భావితరాల భవిష్యత్తు: CM

TG: హైదరాబాద్‌లోని ఉప్పల్ <a href="https://x.com/revanth_anumula/status/2083539813488304532">నల్లచెరువు </a>పునరుజ్జీవం కావడంపై CM రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. <br>చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమేనని పేర్కొన్నారు. హైడ్రా చేపట్టిన చర్యలతో ఆక్రమణలు తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పూడిక తొలగింపు, కట్ట నిర్మాణం, మురుగునీటి శుద్ధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నల్లచెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి జలకళను సంతరించుకుంది.

More in TG