సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో NHRC కీలక ఆదేశాలు

AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ అనుమానాస్పద కస్టడీ మరణం కేసులో NHRC కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్న కమిషన్, పోలీసుల నుంచి నాలుగు వారాల్లో రెండో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కస్టడీలో చిత్రహింసలు, అక్రమ నిర్బంధం, CCTV, హార్డ్‌డిస్క్‌లు మార్చి ఆధారాలు ధ్వంసం చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది. SIT దర్యాప్తులో కస్టడీ మరణానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.



