← Back to news

మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్న గుజరాత్ మాజీ సీఎం

By Vishi· 1h ago· Indianexpress
మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్న గుజరాత్ మాజీ సీఎం

గతంలో గుజరాత్ CMగా పనిచేసిన శంకర్సింహ్ వాఘేలా 10 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి నేను కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం’ అని ప్రకటించారు. గుజరాత్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీని కలిసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 2017లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన వాఘేలా 2027 అసెంబ్లీ ఎన్నికలను తన చివరి అవకాశంగా చూస్తున్నారు.

More in National