తిరుమల భక్తులకు కొత్త ఫెసిలిటీస్.. CM చేతుల మీదుగా

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా CM చంద్రబాబు భక్తుల కోసం కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీవారి విశేషాలు, తిరుమల చరిత్రను తెలుసుకునేలా శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను అందుబాటులోకి తెచ్చారు. భక్తుల సేఫ్టీ కోసం LICతో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం హీలింగ్, డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ను లాంచ్ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, స్టే రూమ్స్ కోసం నందకం యాప్‌ను ప్రారంభించారు.



