← Back to news

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్

By డీకే· 23 Jun 2026· Andhrajyothy· కాకినాడ జిల్లా
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందించారు. ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

More in AP