అరగంట వ్యవధిలో తల్లీకొడుకు మృతి

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ(45) అనారోగ్యంతో బాధపడుతుంది. కుమారుడు సతీష్(18) తల్లిని అమ్మమ్మ సాయంతో ఆటో ఎక్కించి రావులపాలెంలోని ఓ హాస్పిటల్‌కు పంపాడు. మార్గమధ్యలో అపర్ణ మృతి చెందింది. ఈ విషయం తెలియని సతీష్ హాస్పిటల్‌కు వెళ్లి సపర్యలు చేద్దామని వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. అరగంట వ్యవధిలోనే తల్లీ కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



