← Back to news

అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య

By డీకే· 3 Jul 2026· మేడ్చల్ జిల్లా
అప్పులు తీర్చలేక దంపతుల ఆత్మహత్య

TG: తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్(32), శిరీష(28) దంపతులు. వీరు గత కొంతకాలంగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చి, హయత్‌నగర్‌ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మేడ్చల్‌ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు కిందపడి దంపతులు మృతి చెందారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.