← Back to news

ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో కుదుపులు.. 12 మంది!

By Mahesh· 4 Aug 2026· Delhi

థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపుల(టర్బులెన్స్‌)ను ఎదుర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు క్యాబిన్ స్టాఫ్ తో పాటు 12 మంది గాయపడ్డారు. ఫ్లైట్‌ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విమానం దిల్లీ ఎయిర్‌ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. గాయపడిన వారిని వెంటనే ఎయిర్‌ పోర్టులోని హెల్త్ సెంటర్‌కు పంపినట్లు తెలిపింది. ప్యాసెంజర్, స్టాఫ్ సేఫ్టీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొన్న సంస్థ, ఘటనపై దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

More in News