భార్యతో గొడవ.. పిల్లలతో ప్రాజెక్టులో దూకిన భర్త

TG: భార్యతో గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ (32), సవిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రక్షిత్ (8), అనన్య (5) ఉన్నారు. వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై కృష్ణ ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టిన రెస్క్యూ టీమ్.. ముగ్గురి డెడ్‌బాడీలను బయటకు తీశారు.



