టీచర్ బదిలీపై తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

AP: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆనందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణ బదిలీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆయనను బదిలీ చేస్తే తమ పిల్లలకు TCలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేర్పిస్తామని హెచ్చరించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ప్రోత్సహించిన గోపాలకృష్ణ వల్లే తమ పిల్లలు మంచి విద్య పొందుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేయడం అన్యాయమని ఫైరయ్యారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన MEO చిన్నారావు, గోపాలకృష్ణను తిరిగి ఆనందపురం పాఠశాలలో బోధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



