← Back to news

గ్యాస్ లీకై ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు

By DK· 10 Jun 2026· Dishadaily· కామారెడ్డి జిల్లా
గ్యాస్ లీకై ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు

TG: కామారెడ్డి టౌన్‌ వినాయకనగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకవడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పుతుండగా మల్లవ్వ, మౌనిక, అలేఖ్య అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. గ్యాస్ లీకైనప్పుడు సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.