← Back to news

అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు

By DK· 12 Jun 2026· Hmtvlive· హైదరాబాద్‌
అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు

TG: ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని రాయల్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌ ఫోర్త్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్‌, ACతో పాటు ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర ఫ్లాట్ల నివాసితులు టెన్షన్ పడ్డారు. ఘటన సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.