← Back to news

రోడ్డెక్కిన అవుట్‌సోర్సింగ్ టీచర్లు.. మంత్రి ఇంటి ముట్టడి

By DK· 27 Jun 2026· పార్వతీపురం మన్యం జిల్లా
రోడ్డెక్కిన అవుట్‌సోర్సింగ్ టీచర్లు.. మంత్రి ఇంటి ముట్టడి

AP: ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిని ముట్టడించారు. 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తొలగించడం దారుణమన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. న్యాయం చేయండి.. మా ఉద్యోగాల్ని కాపాడండి అని నినాదాలు చేశారు. రాష్ట్రంలో DSC-2025 వల్ల తమ ఉద్యోగ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుండటంతో 40రోజులుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు.

More in AP