ORRపై ఘోర ప్రమాదం

TG: మేడ్చల్ జిల్లా కీసర PS పరిధిలోని ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు మెదక్ జిల్లాకు చెందిన రాములు (60), రషీద్ (40)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



