ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లు

బషీరాబాద్ మండలం నావంద్గి కాగ్నా నది నుంచి ఇసుక తరలింపునకు ఆన్‌లైన్ పర్మిషన్లు ఉన్నా గుడి పేరు చెప్పి ట్రాక్టర్‌కు 1,000 రూపాయలు ఎక్స్‌ట్రా డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఈ వసూళ్లు జరుగుతున్నాయని బషీరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పర్మిషన్ ఉన్నా ట్రాక్టర్లను అడ్డుకోవడంపై ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని తహసీల్దార్‌కి కంప్లైంట్ ఇచ్చారు.


