← Back to news

ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ

By DK· 25 Jun 2026· హైదరాబాద్‌
ATM క్యాష్ దోపిడీలో షాకింగ్ ట్విస్ట్.. డ్రైవరే దొంగ

TG: హైదరాబాద్ IS సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ATM క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న సంతోష్‌నగర్ SBI ATMలో కస్టోడియన్లు, గన్‌మెన్ నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17లక్షలు ఉన్న బ్యాగ్‌తో పరారయ్యాడు. డ్రైవర్ శ్రీనివాస్ కనిపించకపోవడం, బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. CC కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, బైక్‌పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్ధారించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.