IMD చల్లని కబరు.. ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు

వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దక్షిణ కోస్తాలో ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది. అలాగే వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది. మరో 48 గంటల లోపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి.



