అమెరికాలో AP యువతి మృతి

AP: పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మల పెద్ద కుమార్తె ప్రసన్న 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఆమె ఇటీవలే MS పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. న్యూజెర్సీలో తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రసన్న స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితులకు తీవ్ర గాయాలయ్యాయి.



