← Back to news

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజుపై సిట్ సీరియస్

By DK· 24 Jun 2026· Dishadaily
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజుపై సిట్ సీరియస్

AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్టైన CI నాగరాజును సిట్ సుదీర్ఘంగా విచారిస్తోంది. అధికారులు సాయికృష్ణ అదృశ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. CI నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేస్తుండటంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. సీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, సాయికృష్ణ ఆచూకీ దొరకకపోవడం, CC ఫుటేజ్ మాయమవ్వడం వంటి పరిణామాలు ఇది లాకప్‌డెత్ అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నాగరాజును నేడు కోర్టులో ప్రవేశపెట్టనుండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజుపై సిట్ సీరియస్

More in AP