← Back to news

ఉద్యమానికి సిద్ధం కావాలి: AP JAC

By DK· 24 Jun 2026· Sakshi· విజయవాడ
ఉద్యమానికి సిద్ధం కావాలి: AP JAC

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాప్యం లేకుండా మధ్యంతర భృతి ప్రకటించాలని, 12వ PRC కమిషనర్‌ను నియమించాలని AP JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగుల JAC, అనుబంధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ DAలను విడుదల చేయాలని, 11వ PRC ఎరియర్స్ తదితర ఆర్థికపరమైన సమస్యలు, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధం కావాలని AP JAC పిలుపునిచ్చింది.

More in AP