← Back to news

దానం నాగేందర్ పిటిషన్‌పై 23న సుప్రీంలో విచారణ

By Mahesh· 3h ago· Livelaw· TG
దానం నాగేందర్ పిటిషన్‌పై 23న సుప్రీంలో విచారణ

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ <a href="https://www.theclearcutnews.com/n/qsZXRqc">సుప్రీంకోర్టుకు వెళ్లారు.</a> హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను దానం తరఫు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి ఈరోజు సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఖైరతాబాద్ సీటు వేకెంట్ కావడంతో, లేట్ అయితే బైఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని దానం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI) సూర్యకాంత్ ఈ పిటిషన్‌ను ఈనెల 23న విచారణ జరిపేందుకు అంగీకరించారు.

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 1h ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.