← Back to news

బాలికపై లైంగికదాడి.. తండ్రీకొడుకులకు జీవితఖైదు

By DK· 5 Jun 2026· Hmtvlive· హైదరాబాద్‌
బాలికపై లైంగికదాడి.. తండ్రీకొడుకులకు జీవితఖైదు

TG: కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన శివకుమార్(45), అతని కుమారుడు శామ్యూల్(21) మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. 2023 ఆగస్టు 10న స్థానికంగా ఉండే కూలీ దంపతులు పనికి వెళ్తూ తమ ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లారు. ఓ బాలికను పక్కింటి శివకుమార్, శామ్యూల్ వారి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత తల్లి పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా కోర్టు తండ్రీకొడుకులకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.