← Back to news

అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త

By DK· 6 Jun 2026· Hmtvlive· హైదరాబాద్‌
అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త

TG: భార్యపై అనుమానంతో భర్త రాడ్‌తో దాడిచేసి చంపాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్‌ దంపతులు ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. అత్తాపూర్‌ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోమలి వాచ్‌మెన్‌‌గా చేస్తూ అదే భవనంలోని పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. భర్త అవినాష్‌ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో అవినాష్ కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్‌తో దాడిచేసి భార్యను నడిరోడ్డుపై చంపాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.