సకల కళల జేఏసీ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం

TG: తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు గడిచినా తెలంగాణ జానపద అకాడమీ గానీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం గానీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదని సకల కళల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. భావితరాలకు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి తెలంగాణ జానపద అకాడమీ, తెలంగాణ జానపద విశ్వవిద్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశానికి తప్పక రావాలని సకల కళల జేఏసీ తరఫున భూపతి వెంకటేశ్వర్లు కోరారు.



