← Back to news

బెంగళూరు మెట్రో జర్నీకి 70 వేల జీతం కావాల్సిందేనా?

By Nani Eluri· 7h ago· Thehindu
బెంగళూరు మెట్రో జర్నీకి 70 వేల జీతం కావాల్సిందేనా?

బెంగళూరులో ‘నమ్మ మెట్రో’లో రోజూ జర్నీ చేయాలంటే నెలకు సుమారు 70,400 రూపాయల జీతం ఉండాలని ‘ది హిందూ’ ఎనాలిసిస్ తెలిపింది. 15 కిలోమీటర్ల వన్‌వే జర్నీ, రెండు వైపులా 2 కిలోమీటర్ల లాస్ట్‌మైల్ ట్రావెల్ కలిపి నెలకు 3,520 రూపాయలు ఖర్చవుతుందని లెక్కించింది. ఈ ఖర్చు జీతంలో 5 శాతానికి మించకూడదనే లెక్కతో 70,400 జీతాన్ని అంచనా వేసింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాతో పోలిస్తే బెంగళూరులో మెట్రో జర్నీ ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపింది.

బెంగళూరు మెట్రో జర్నీకి 70 వేల జీతం కావాల్సిందేనా?

More in Politics