బీచ్‌లో CM సర్‌ప్రైజ్.. మహిళకు తక్షణ పెన్షన్ ఆదేశం!

AP: విశాఖ RKబీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొన్నారు. బీచ్‌లో పారిశుద్ధ్య పనులు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపును పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో మాట్లాడారు. బీచ్‌లో మిక్చర్ అమ్ముతున్న మహిళతో మాట్లాడి, ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.


