← Back to news

రాత్రి 10 తర్వాత డిన్నర్.. అనారోగ్యమే!

By Anusha· 14h ago
రాత్రి 10 తర్వాత డిన్నర్.. అనారోగ్యమే!

TG: హైదరాబాద్‌లో 64 శాతం మంది ఉద్యోగులు రాత్రి 10 గంటల తర్వాతే డిన్నర్‌ చేస్తున్నట్లు బ్లూసెమీకి చెందిన ఐవా వెల్‌నెస్‌ ట్రాకర్‌ డేటా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 54 శాతం మంది లేటుగా తింటున్నట్లు 30 వేల మంది నుంచి సేకరించిన 35 లక్షల రీడింగ్స్‌లో గుర్తించారు. నిద్రకు ముందు 40 శాతం మంది టీ, కాఫీలు తాగుతున్నట్లు తేలింది. ఆలస్యంగా తినడం గ్లూకోజ్‌ స్థాయిలపై ప్రభావం చూపుతుందని ఈ స్టడీ తెలిపింది. డిన్నర్‌ త్వరగా ముగించడం, భోజనం తర్వాత నడక, రోజూ 30 నిమిషాల వ్యాయామం ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొంది.

More in TG

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!
TG· 15h ago

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!

TG: రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ప్రభుత్వ విద్యలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకూ.. ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌తో పాటూ.. విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని రావాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే <a href="https://www.theclearcutnews.com/n/9RMisjV">TPF విద్యా బస్సుయాత్ర</a> కొనసాగుతోంది.