10 ఏళ్లుగా పెండింగ్ లో తెలంగాణ లిఫ్ట్స్ యాక్ట్ బిల్లు

తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ప్రతిపాదిత 'లిఫ్ట్స్ యాక్ట్' బిల్లు ఇంకా చట్టరూపం దాల్చలేదు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, మరణాలు ఈ చట్టం యొక్క అత్యవసర ప్రాధాన్యతను గుర్తు చేస్తు న్నాయి. ప్రస్తుతం ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో భద్రతా ప్రమాణాలు లోపించాయి. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ బిల్డింగులలోని లిఫ్టులకు తప్పనిసరి తనిఖీలు, కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది.



