HYDRAAకు మద్దతుగా భారీ ర్యాలీ
TG: హైదరాబాద్‌లో హైడ్రాకు మద్దతుగా పలు కాలనీలు, బస్తీ వాసులు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. NTR గార్డెన్స్ నుంచి అమరవీరుల స్మారక చిహ్నం వరకు జరిగిన ర్యాలీలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొని హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. HYDRAAను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షించడంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణలో హైడ్రా సేవలను ప్రశంసిస్తూ, సంస్థను మరింత బలోపేతం చేసి శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.



