TC కోసం ప్రిన్సిపల్ షాకింగ్ డిమాండ్

TG: స్టూడెంట్స్‌కు విద్యాబుద్దులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపల్ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ స్టూడెంట్‌ని వేధిస్తున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ PG కాలేజ్ ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ తన ఇంటికొచ్చి శారీరకంగా కలిస్తేనే TC ఇస్తానంటూ విద్యార్థికి చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్ దారుణాలను బయటపెట్టాలని ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్లాడు. మార్క్ అనైతిక చేష్టలను అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. వెంటనే ఆ బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.



