← Back to news

CMC ఆఫీస్‌ ముట్టడి.. హైటెన్షన్

By dk· 11 Aug 2026· హైదరాబాద్
CMC ఆఫీస్‌ ముట్టడి.. హైటెన్షన్

TG: హైదరాబాద్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) కార్యాలయం వద్ద చెత్తసేకరణ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ స్వచ్ఛ ఆటో, రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది కార్మికులు CMC ఆఫీస్‌ను ముట్టడించారు. వారిని పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పాత విధానంలోనే పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, ఆస్తిపన్నుతో కలిపి చెత్త పన్ను వసూలుచేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-ఆటోల పేరుతో కొత్త వాహనాలను తీసుకొచ్చి ఉపాధిని దెబ్బతీయవద్దని కోరారు.

More in TG