← Back to news

బెంగళూరు డే కేర్ సెంటర్ ఇన్సిడెంట్ పై సిట్ ఏర్పాటు

By DS· 3 Jul 2026· Bangalore
బెంగళూరు డే కేర్ సెంటర్ ఇన్సిడెంట్ పై సిట్ ఏర్పాటు

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని క్యాంపస్‌లో లిటిల్ బడ్స్ డేకేర్ సెంటర్‌'లో షాకింగ్ ఇన్సిడెంట్ పై సిట్ ఏర్పాటైంది. సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మాజీ ఉద్యోగి బయటపెట్టిన ఈ వీడియోలలో.. కేర్‌టేకర్లు 2 నుండి 3 ఏళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్ మెషీన్‌లో పెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రేతో నోట్లోకి నీళ్లు కొట్టడం, బాత్‌రూమ్‌లలో పెట్టి లాక్ చేయడం లాంటి క్రూరమైన చేష్టలతో దొరికిపోయారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.