యువకుడిపై కొడవళ్లతో దాడి

AP: అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లి సమీపంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆచారి మణికంఠ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావమైన మణికంఠను చికిత్స నిమిత్తం అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ దాడికి పాత కక్షలు కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



