జపాన్ పర్యటనకు ఎంపికైన హెచ్‌ఎంకు ఘన సత్కారం

TG: విద్యా పరిశోధనల కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున జపాన్ పర్యటనకు ఎంపికైన నాగర్‌కర్నూల్ ZPHS ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌రెడ్డిని శ్రీవెంకటేశ్వర కాలనీ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. శనివారం భాస్కర్‌రెడ్డికి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. కాలనీ గౌరవాధ్యక్షులు క్రిష్ణయ్య, అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దశరథం, కోశాధికారి సతీష్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జపాన్ పర్యటనకు ఎంపిక కావడం నాగర్‌కర్నూల్‌కు గర్వకారణమని వారు పేర్కొన్నారు.



