పరకాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం

TG వరంగల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. పరకాల పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



