← Back to news

లేడీ డాక్టర్ పై బీజేపి యువనేత లైంగిక వేధింపులు

By DS· 3 Jul 2026· MP
లేడీ డాక్టర్ పై  బీజేపి యువనేత లైంగిక వేధింపులు

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపి నేత ఏకంగా డాక్టర్ నే లైంగిక వేధింపులకు గురిచేశాడు. సాగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ మహిళా డాక్టర్ పై బీజేపీ రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్ శ్రీవాస్తవ (అనిల్ పిప్రా) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో, ఆసుపత్రి బయటకు వస్తే తుపాకీతో కాల్చి చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనపై సాగర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పై జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (JUDA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.